భక్తిశ్రద్ధలతో మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం
స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు
పాల్గొన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబం
నగరోత్సవంలో పాల్గొన్న భక్త జనం
ప్రకాశం జిల్లా చీమకుర్తి, మహానాడు : చీమకుర్తి హరిహర క్షేత్రంలో గత రెండు రోజులుగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అధ్వర్యంలో మంగళ వారం మహాపూర్ణాహుతి, మహా కుంభాభిషేకం పూజలు జరిగాయి. ఉదయం హరిహర సుత అయ్యప్పస్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి, పార్వతి సమేత నగరేశ్వర స్వామి వార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా పాండురంగారావు దంపతులకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో పాటు శిద్దా పెద్దబాబు, శిద్దా బాలాజీ దంపతులు క్షేత్రంలో విశేష పూజలు నిర్వహించారు. 18వ వార్షికోత్సవం సందర్భంగా హరిహర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.