డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం

అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, సిగ్నేచర్
అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో, సిగ్నేచర్‌

హైదరాబాద్, మహానాడు:  తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం నెలకొంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, సిగ్నేచర్, అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో, సిగ్నేచర్‌ ప్రచురితమవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ, బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన వల్లెపు రామచంద్రయ్య డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం పోస్టుకు అప్లై చేసుకున్నాడు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే అతని ఫోటో బదులు, ఒక అమ్మాయి ఫోటో, సంతకం ఉంది.

అలాగే, నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన రుద్రారపు భవ్య డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం పోస్టుకు దరఖాస్తు చేసుకున్నది. ఆదివారం హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగా.. ఆమె ఫొటో, సంతకానికి బదులు వేరొక అబ్బాయి ఫొటో, అతడి సిగ్నేచర్‌ వచ్చింది.

అధికారులు స్పందించి న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.