మంత్రి లోకేష్ కు సహచర మంత్రుల అభినందనలు

అమరావతి, మహానాడు: అమెరికాలో వారం రోజులపాటు పెట్టుబడుల జైత్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి అమరావతి విచ్చేసిన మంత్రి లోకేష్ ను సహచర మంత్రులు బుధవారం ఉండవల్లి నివాసంలో కలిసి అభినందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా, పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడానికి మీరు పడుతున్న కష్టం తమకందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టడంలో గేమ్ చేంజర్ కాగలవని వారు కొనియాడారు.