పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి 22వ వార్డుకు చెందిన మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ పసుపులేటి ఓంకార్ గురువారం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేశారు. ఆయనతో పాటు 20 కుటుంబాలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.