బీఆర్‌ఎస్‌ నేతలను రక్షించేందుకే కాంగ్రెస్‌ నాటకాలు

విచారణ నివేదికలు ఎందుకు బయటపెట్టలేదు?
పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టకపోవటంపై అనుమానాలు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్‌

హైదరాబాద్‌, మహానాడు: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణ నివేదికలు ఎందుకు బహిర్గతం చేయటం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడి యా ఇన్‌చార్జ్‌ ఎన్వీ సుభాష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో రేవంత్‌ను ప్రశ్నిం చారు. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన తప్పులపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు నాటకాలాడుతున్నారని విమ ర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి వాటిపై పారదర్శకంగా విచారణ జరిపి పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు సంబంధించి జరిగిన అవక తవకలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, కేంద్రం లోని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కూడా ఒక నివేదిక సమర్పించిందన్నా రు.

ఈ రెండు నివేదికలు కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను, లోపాలను బట్టబయలు చేయడంతో పాటు అసలు ఏం జరిగిందని అంశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులను కాపాడేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నివేదికలను పబ్లిక్‌ డోమైన్‌లో పెట్టకుం డా రహస్యంగానే ఉంచుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మేడిగడ్డ, ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో అధికారులను బాధ్యులను చేసే ప్రయ త్నం చేస్తున్నారని, బీఆర్‌ఎస్‌ నాయకుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడ కపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు.