లడ్డు కల్తీ పర్యవసానం…

జగన్‌ ఇల్లు ముట్టడి!

– శ్రీవారి దేవాలయం వద్ద జగన్ 108 ప్రదక్షిణాలు చేయాలి
– మోకాళ్లపై కూర్చొని లెంపలు వేసుకోవాలి
– హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
– మాజీ సీఎం వైఖరితో క్షోభకు గురైన కోట్లాది మంది హిందువులు
– ఆ పాపం పండే ఎన్నికల్లో అపజయం
– ఇంటి ముందు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం
– ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
– బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంశీ కృష్ణ నాయకత్వం
– బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలింపు
– టీడీపీ, జనసేన నేతల సంఘీభావం

తాడేపల్లి, మహానాడు: లడ్డు కల్తీ వ్యవహారంపై శ్రీవారి భక్తులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి, ఇతర వైసీపీ నేతలకు శాపనార్థలు పెడుతున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) యువమోర్చా నేతలు ఆందోళనకు దిగారు. తాడేపల్లిలోని జగన్‌ ఇల్లు ముట్టడికి ఆదివారం ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ నాయకత్వం వహించారు. ఆందోళనలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఏ విధంగా అయితే అపవిత్రం చేశారో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలోని ప్రసాదాన్ని కూడా ఇదే విధంగా అపవిత్రం చేసినట్టుగా అనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని దేవాలయాల్లోని ప్రసాదాన్ని తక్షణమే ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ వారికి పంపి నివేదిక తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవాలయాల్లో హిందువులు కాకుండా అన్యమతస్తులు ఉంటం వల్లే ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయని అటువంటి అన్యమతస్తులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరారు. దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలని, అలాగే తిరుమలలోని లడ్డు ప్రసాదానికి కేటాయించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరైతే అధికారులు పరిశీలిస్తారో వారందరి జాబితా సేకరించి తక్షణమే వారందరిని భర్తరఫ్ చేయాలని నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మంగళగిరి అసెంబ్లీ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత్ కృష్ణారెడ్డి, యువమోర్చా గుంటూరు, విజయవాడ, బాపట్ల, కాకినాడ జిల్లా అధ్యక్షులు మైల హరికృష్ణ, నరసరాజు, మణికుమార్, పాపారావు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవన్ ప్రసాద్, శివ యువమోర్చా కోస్తాంధ్రజోన్ ఇన్‌చార్జి అశోక్ రెడ్డి, యువమోర్చా ఐటీ సెల్ స్టేట్ కన్వీనర్ జీవీ రెడ్డి, యువమోర్చా రాష్ట్ర కోశాధికారి కృష్ణ చైతన్య, యువమోర్చా సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ రవి మణికాంత్, వాసు, తదితరులు పాల్గొన్నారు.