జగన్‌రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి పోస్టుల పందేరానికి కుట్ర

-ఫలితాలు రాకముందే సీఎస్‌ జవహర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి కుయుక్తులు
 -అడ్డగోలుగా లిస్ట్‌ తయారు చేసి సొంత జిల్లాల వారికి కట్టబెట్టేందుకు ప్లాన్‌
 -ఎన్నికల కమిషన్‌కు పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్‌కు విరుద్ధం
 -అర్హత ఉన్న వారికి తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ జారీ
 -అడ్డగోలు నిర్ణయాన్ని ఈసీ అడ్డుకుని ఎన్నికల ఫలితాల తర్వాత నియామకం చేపట్టాలి
 -భోగాపురంలో ఫలితాలు రాక ముందే పేదల భూములు కొట్టేసేందుకు జవహర్‌రెడ్డి ప్లాన్‌
 -జీవో 596 అడ్డుపెట్టుకుని 2000 వేల ఎకరాలు దోచుకునేందుకు ప్లాన్‌ చేయలేదా…
 -అందుకే ఎయిర్‌పోర్ట్‌ పరిశీలన పేరుతో ఆ ప్రాంతంలో పర్యటించారు
 -రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి డైరెక్షన్‌లో నడిచిన అధికారులే కారణం
 -టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మంగళగిరి, మహానాడు : అర్హత ఉన్న అధికారులకు అన్యాయం చేసి అయిన వారికి ఐఏఎస్‌ పదవులను కట్టబెట్టేందుకు జగన్‌ రెడ్డి కనుసన్నల్లో సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జవహర్‌రెడ్డి సీఎస్‌గా ఉంటే రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్‌ సజా వుగా జరగదన్నారు. ఫలితాలు వచ్చే లోపు వేల కోట్ల విలువ చేసే పేదల భూ ములను బోగాపురంలో కొట్టేసేందుకు సీఎస్‌, వైసీపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారన్నా రు. అందుకే భోగాపురం ఎయిర్‌పోర్టు పరిశీలన పేరుతో ఇటీవల జవహర్‌ రెడ్డి అక్కడికి వెళ్లారని ఆరోపించారు.

ఎన్నికల కోడ్‌ ముందు నియామకాలు ఎందుకు?

ఐఏఎస్‌ నియామకాల నోటిఫికేషన్‌ వివరాలు ఎవరికీ తెలియకుండా జవహర్‌ రెడ్డి జాగ్రత్త పడ్డారు. నోటిఫికేషన్‌కు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేలా చూడాలి. వారిపై ఏమి కేసులు ఉన్నాయో వారి గురించి తరువుగా విచారించాలి. ఇదంతా లేకుండా అడ్డగోలుగా నియామకాలు చేస్తున్నారంటూ మీడియా ఘోషిస్తుంటే ఎందుకు స్పందించడం లేదు. నోటిఫికేషన్‌పై గోప్యత ఎందుకు? గడువు ఎందు కు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు తయారు చేశారు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్లీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్‌ ముందు నియామకాలు ఎందుకో సీఎస్‌ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ప్రతిపాదనలు పంపాలా?

సీఈసీ చర్యలు తీసుకోవాలి

జగన్‌పై స్వామి భక్తితో సీఎస్‌ ఇది చేస్తున్నాడు. సీఈసీ దీనిపై చర్యలు తీసుకోవా లి. హడావిడి ఐఏఎస్‌ ఎంపికలపై టీడీపీ అధినేత చంద్రబాబు సీఈసీతో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌కు ఉత్తరం రాశారు. ఎలక్షన్‌ కమిషన్‌ విధులు చూస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. యూపీపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌కు కూడా అన్ని వివరాలతో చంద్రబాబు ఉత్తరం రాశారు. ఐఏఎస్‌లను నియమించుకునేందుకు ఇంటర్వ్యూలకు జవహర్‌ రెడ్డి ప్రతిపాదనలు పంపడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. జూన్‌ 4న ఎన్నికల కౌంటిం గ్‌ ఉన్నందున ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం సరైనది కాదు.

అస్మదీయులకు పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్‌

అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా సచివాలయంలో హెచ్‌ఓడీలకు కూడా తెలియకుండా నోటీసులు ఇవ్వడం అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతుందో అర్థం అవుతుంది. ఏ స్థాయిలో అస్మదీయులు, బంధువులకు పదవులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారో స్పష్టం అవుతుంది. వచ్చిన 49 మంది జాబితాలో మీకు కావాల్సిన వారు 10 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు మీ సామాజికవర్గం వారు. మీ సొంత జిల్లా వారే ఉన్నారు. డీడీ కేడర్‌లో ఎనిమిది సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేయాలని ఉన్నా కేవలం రెండేళ్ల అర్హత ఉన్నా రూల్స్‌కు విరుద్ధంగా గడికోట మాధురి పేరును మొదట పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని భావించి అస్మదీయులకు పదవులను కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారు.

ఏకపక్షంగా యూపీఎస్సీకి ప్రతిపాదనలు

ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎస్‌ కార్యాలయాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని యూపీఎస్సీకి ప్రతిపాదనలు పంపారు. రూపొందించిన జాబితా పారదర్శకంగా జరగలేదు కాబట్టి ఈ పదోన్నతుల అంశాన్ని జూన్‌ 7 తరువాత చేపట్టాలని చంద్రబాబు యూపీఎస్సీ చైర్మన్‌కు ఉత్తరం రాశారు. ఎవరికైతే అర్హత ఉందో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అధికారులకు న్యాయం జరగాలని చంద్రబా బు రాసిన ఉత్తరం ప్రజలకు ముందుకు తెచ్చాం. దీనిపై వెంటనే ఎలక్షన్‌ కమిష న్‌ స్పందించాలి. యూపీఎస్సీ చైర్మన్‌, సంబంధించిన అధికారులు స్పందించాలి.

భోగాపురంలో భూదందాకు ప్లాన్‌ చేయలేదా?

కేసు నమోదు అయినా హైకోర్టు నుంచి రక్షణ తీసుకుని పిన్నెల్లి చట్టాన్ని అడ్డుపె ట్టుకుని వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నాడు. ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసు కెళ్లాల్సిన బాధ్యత సీఎస్‌పై లేదా? భోగాపురం ఎయిర్‌ పోర్టు పరిశీలన పేరుతో అక్కడ ఏ దందా నడిపారు? జీవో 596 అడ్డుపెట్టుకుని 2000 వేల ఎకరాల అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ కొట్టేయడానికి ప్లాన్‌ చేయలేదా? ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవీ బంధువులు అడ్డగోలుగా అసైన్‌మెంట్‌ భూములను కొట్టేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌ పోర్టు పనులు అని చెప్పి అక్కడికి ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఆ భూములను కొట్టేసేందుకు కుట్ర చేసింది వాస్తవం కాదా? మీడియాలో వచ్చిన వార్తలపై ఎందుకు స్పందించడం లేదు. సెక్షన్‌ 35-22లను అడ్డు పెట్టుకుని పేదల భూములను దోచుకోవాలని చూస్తారా?

అధికారుల అండతోనే పిన్నెల్లి రెచ్చిపోయాడు

పిన్నెల్లి సమక్షంలో టీడీపీ నేతల తలపగులగొట్టినా సెకార్ట్‌ అధికారి, మొబైల్‌ స్క్వాడ్‌, రిటర్నింగ్‌ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కలెక్టర్‌, వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షించిన అధికారులు ఎందుకు బయటపెట్టలేదు. కిందిస్థాయి ఉద్యోగులనే ఎందుకు బలిచేశారు? ఆ రోజు వీడియోలు బయటపెట్టి పిన్నెల్లిపై 307 కేసు పెట్టి జైలుకు పంపి ఉంటే ఇంతమంది గ్రామాలను వదిలి వెళ్లేవారు కాదు. చీఫ్‌ సెక్రటరీ నియమించిన అధికారుల అండతోనే మాచర్లలో పిన్నెల్లి రెచ్చిపోయాడు. మేము రీపోలింగ్‌ అడిగాం. బుద్ధి లేకుండా సజ్జల రిపోలింగ్‌ అడగలేదని చెబుతున్నాడు. ఈ దారుణాలను మా నాయకుడు లోకేష్‌ ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకుంటే బుద్ధిలేని నాయకులు జోగి, అంబటి, కాసు మహేష్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, సజ్జల మాపై చర్యలు తీసుకోవాలని కోర్టులను కోరడం సిగ్గుచేటు. మాపై బురదచల్లే కార్యక్రమం చేయడం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనం.