ఓటమి భయంతో రౌడీషీటర్లను ఏజెంట్లుగా పెట్టారు
ఎన్ని కుట్రలు చేసినా పవన్‌కళ్యాణ్ గెలుపు ఆపలేరు
తనపై వైసీపీ దుష్ప్రచారాలు మానుకోండి
పిఠాపురం టీడీపీ నేత వర్మ హెచ్చరిక
పిఠాపురం: తనపై వైసీపీ నేతల దుష్ప్రచారాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేతల దుష్పచారం ప్రజలు అర్థం చేసుకున్నారు. అత్యధిక మెజారిటీతో పవన్‌కళ్యాణ్ గెలవబోతున్నాడన్న సమాచారంతో కౌంటింగ్‌కు ఆటంకం కలిగిం చాలన్న దురుద్దేశ కుట్రతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. కౌంటింగ్ పక్రియకు ఏదో రకంగా ఆటంకం కలిగించే యోచనలో వైసీపీ ఉందని, ఓటమి భయంతో కుట్రలు చేస్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీ రౌడీ షీటర్లను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమిస్తుంది. బూత్‌లలో స్థానం కల్పించడం వల్ల కౌంటింగ్ రోజున నిలుపుదల చేయడానికి, గొడవలు జరగడానికి అవకాశం ఉంది. ముందుగానే వారిని గుర్తించి తిరస్కరిస్తే 4వ తేదీన ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తి అవుతుందని తెలిపారు.
ఏ పార్టీకి చెందిన వారైనా సరే కౌంటింగ్ ఏజెంట్లు ఎటువంటి నేరాలకు పాల్పడ్డారో గుర్తించి వారిపై ఒక రిపోర్ట్ ఇవ్వాలని, అటువంటి వ్యక్తులకు బూత్‌లలో స్థానం కల్పించకూడదని పిఠాపురం నియోజక వర్గ రిటర్న అధికారి, జిల్లా ఎస్పీని విన్నవిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పార్టీకి చెందిన రౌడీ మూకలు ఇండిపెండెంట్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల ఫారం తీసుకుని వస్తు న్నారు. వారికి సజ్జల సూచనలే నిదర్శనమన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా సమర్థ వంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. జగన్ రెడ్డికి కేఏ పాల్‌తో మరింత స్నేహం ఎక్కువైందని, పాల్ నేను ఎంపీ అయిపోయానని, కౌంటింగ్ అవసరం లేదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, కొండేపూడి సూర్యప్రకాష్, బర్ల అప్పారావు, సోము సత్యనారాయణ, పిల్లి చిన్న, నామా దొరబాబు, అడ్డూరి శ్రీను, బొజ్జా సూరిబాబు, విశ్వనాధుల వీరభద్ర రావు, కోరుప్రోలు శ్రీను, మొల్లి మరిడి రాజు, నెక్కల సత్యనారాయణ, దాసం ప్రసాద్, శివాల పాపారావు, వేణుం సురేష్, వాసంశెట్టి సూరిబాబు, గుత్తుల రామకృష్ణ, మట్ట గణేష్, మూర్తి పాల్గొన్నారు.