– ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ, మహానాడు: జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్… ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె అన్న జగన్నుద్దేశించి బుధవారం మీడియాతో ఏమన్నారంటే.. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదు.
గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ.. వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆపలేదు. 2016 లో ఈడీ, భూములను అటాచ్ చేయడంతో షేర్ల బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదం. 2019 లో షర్మిలా రెడ్డి కి 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంఓయూ మీద సంతకం చేశారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని?
2021 లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన, సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు? అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని? అపుడు స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా? 2021 లో జగన్ , భారతి రెడ్డి తమ షేర్స్ పై సంతకం చేసి, విజయమ్మ కి ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ఇచ్చే ముందు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని..?
షేర్స్ ట్రాన్స్ఫర్ కి , బెయిల్ రద్దుకు సంబధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఎన్సీఎల్టీ లో కేసు ఉంది కాబట్టి.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని .. కొడుకు బెయిల్ కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మ కి తెలుసు. విజయమ్మ లేఖ తాను రాయకపోతే… ఆ లేఖతో సంబంధం లేదని, అది నేను రాయలేదని, స్వయంగా లేఖను ఖండించే వారు కదా..