గుంటూరు, మహానాడు: ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధించేవాడు. ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం, నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు.