-నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి
-జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశం
-ఎస్పీ, ఇసుక కమిటీ సభ్యులతో రీచ్‌ల పరిశీలన
గుంటూరు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇసుక తవ్వకాలు జరగకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీస్, సంబంధిత శాఖల అధికా రులు నిరంతరం పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్పీ తుషార్ డూండి, జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్‌జైన్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలిసి తాడేపల్లి, కొల్లిపర మండలాల్లోని ఇసుక రీచ్‌లను తనిఖీ చేశారు.
మొదటగా కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం 14, 15 ఇసుక రీచ్‌లను పరిశీలించారు. అనంతరం మున్నంగి ఇసుక రీచ్‌ను, తాడేప ల్లి మండలం గుండెమెడ ఇసుక రీచ్‌లను పరిశీలించారు. రీచ్‌ల దగ్గర 24 గంట లు పర్యవేక్షించేందుకు రెండు షిఫ్ట్‌లుగా నియమించిన బృందాలలోని సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు.
ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో రీచ్‌లలో తవ్వకాలు జరగకుండా చూడాలని సూచించారు. అనుమతులు పొందిన పరిధిలో నే మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు జరిగేలా మైనింగ్ శాఖ అధికారులతో పాటు పోలీస్, రెవెన్యూ, శాండ్ కమిటీలోని ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవే క్షించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని సూచించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలపై వచ్చే ఫిర్యాదు లపై కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నిర్దేశించిన ఫార్మాట్‌లో నివేదిక ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో శ్రీకర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ కన్వీనర్, మైనింగ్ శాఖ డీడీ చంద్రశేఖర్, జిల్లా ఎస్‌ఈబీ అదనపు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీదేవి, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డెరెక్టర్ వందనం, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరు నారాయణ, జిల్లా ఉపర వాణా కమిషనర్ కరీం, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.