Mahanaadu-Logo-PNG-Large

ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి

– ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్
– మంత్రి టి.జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ సైలాయ్ జాకీ

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కంపెనీలు ఏర్పాటుచేసేందుకు స‌హ‌క‌రించాల‌ని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ సైలాయ్ జాకీ ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. మంగళగిరిలో ఏపీఐఐసీ భవనంలో మంత్రి టి.జి భరత్ ను ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ సైలాయ్ జాకీ తో పాటు వారి బృందం కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని వివరించారు. ఆస్ట్రేలియాలో తెలుగువాళ్లు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నార‌ని మంత్రి టి.జి భరత్ చెప్పారు. ఏపీలో కంపెనీలు విస్త‌రించేందుకు కృషి చేయాల‌న్నారు. ఈ విష‌యంపై ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సానుకూలంగా స్పందించిన‌ట్లు మంత్రి తెలిపారు.