Mahanaadu-Logo-PNG-Large

ఏసీబీలో అవినీతి చేపలు

-ఒకేసారి అయిదుగురిపై వేటు
-సమగ్ర విచారణకు
-ఉన్నతాధికారుల ఆదేశం

విజయవాడ ఏసీబీ రేంజి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు డీఎ స్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్పై ఉన్న తాధికారులు వేటు వేశారు. అవినీతి అధికారులతో కుమ్మక్కు కావడం, కీలక సమాచారాన్ని లీక్ చేయడం, వారి నుంచి ఆర్థికంగా లబ్ది పొందడం, ఇలా పలు ఆరోపణలు రావడంతో వీరిని అనిశా నుంచి తప్పించి, మాతృ యూనిట్లకు సరెండర్ చేశారు.

ఈ ఉదంతంపై అనిశా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అనిశా నుంచి తప్పించిన డీఎస్పీలు శరత్, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కృపానందం, శివకుమార్, కానిస్టేబుల్ సురేష్లు దాదాపు నాలుగేళ్లుగా ఏసీబీలోనే విధులు నిర్వర్తిస్తు న్నారు. ఫిర్యాదులపై నామమాత్రపు చర్యలు తీసు కుంటూ అవతలి వ్యక్తులతో కుమ్మక్కు అయినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

అవినీతి అధికారుల నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందుతూ కేసులను నీరుగారుస్తున్నట్లు తెలిసింది. వీటిపై రహస్య విచారణ నిర్వహించగా ప్రాధమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ నేప థ్యంలో నిష్పక్షపాత విచారణ నిమిత్తం అయిదుగురి నీ అనిశా నుంచి వెనక్కు పంపించారు.

డీఎస్పీ లను డీజీపీ కార్యాలయానికి, సీఐలను వారి రేంజి కార్యాలయానికి, కానిస్టేబుల్ను జిల్లా యూనిట్కు సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్డిజి స్టార్ బాలనాగ ధర్మసింగ్ అవినీతిని తొలుత ఈ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని సమా చారం. అందుకే ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా అనిశా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) హి విభాగాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది.

గత ఏడాది. నవంబరులో సీఐయూ అధికారులు సబజిస్ట్రార్ ఆస్తులపై వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. సబజిస్ట్రార్కు ఈ సమాచారం ముందుగా అందడంతో పరారయ్యారు. మూడు నెలలుగా ఆయన ఆచూకీ దొరకలేదు. సరెండర్ అయిన వారి నుంచే సబజిస్ట్రార్కు సమాచారం వెళ్లినట్లుగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.