అమరావతి: కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా 12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని, కౌంటింగ్ సెంటర్లపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టామని వివరించారు.