సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం

సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS) ఆసుపత్రిలో చేరి, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.

ప్రకటనలో, ఏచూరి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది. ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఏచూరి గత నెల 19న ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఏచూరి ఆరోగ్యంపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.