విజయవాడ, మహానాడు: ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆమోదించిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. అరకు (ఎస్టీ) పార్లమెంటుకు పాచిపెంట అప్పలనర్స, అసెంబ్లీ సీట్లలో రంపచోడవరం లోతా రామారావు, అరకు దీసరి గంగరాజు, కురుపాం, మండంగి రమణ, గాజువాక, మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్ చిగురుపాటి బాబురావు, గన్నవరం కళ్ళం వెంకటేశ్వరరావు, మంగళగిరి జొన్నా శివశంకర్, నెల్లూరు సిటీ మూలం రమేష్, కర్నూలు డి.గౌస్‌దేశాయి, సంతనూతలపాడు ఉబ్బా ఆదిలక్ష్మి ప్రకటించింది. అయితేకాంగ్రెస్‌తో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు పార్లమెంటు, 5 అసెంబ్లీ (రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు సిటీ) స్థానాలపై ఉమ్మడి అవగాహన కుదిరింది. మిగతా 5 స్థానాలపై చర్చలు కొనసాగించి నామినేషన్‌లోగా ఒక అవగాహనకు రావాలని ఉభయ పార్టీలు నిర్ణయించాయి. అలాగే సీపీఎం, సీపీఐ పోటీ చేస్తున్న స్థానాలలో పరస్పరం బలపర్చుకోవాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.