ప్లాన్ అప్రూవల్‌కు లంచం డిమాండ్
రూ.30 వేలు లంచం తీసుకుంటూ…
గుంటూరు జిల్లా: తెనాలి పట్టణంలోని చెంచుపేట అమరావతి ప్లాట్స్‌లోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సీఆర్‌డీఏ ప్లాన్ అప్రూవల్ కోసం టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఎల్.చంద్ర శేఖరరావు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర సాయినాథ్ రూ.30 వేలు లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.