నిరాధార వార్తలు ప్రచారం చేస్తే క్రిమినల్‌ చర్యలు

పల్నాడు జిల్లా ఏఎస్పీ(అడ్మిన్‌) ఆర్‌.రాఘవేంద్ర

నరసరావుపేట, మహానాడు: పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజున, తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నిరాధార, అబద్ధపు సమాచారం ప్రసారం చేసిన వారిపై చట్టపరపమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పల్నాడు జిల్లా ఏఎస్పీ(అడ్మిన్‌) ఆర్‌.రాఘవేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

అబద్ధపు ప్రచారాలు, ట్రోలింగ్‌లను తీవ్రంగా పరిగణిస్తామని వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర గ్రూపుల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే గ్రూప్‌ అడ్మిన్‌దే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్స్‌, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, సరైన సమాచారం లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధార, వాస్తవ దూరమైన పోస్టులు, వీడియోలు, వార్తలు సామాజిక మాధ్య మాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వివాదాస్పద పోస్టింగ్‌ సంబంధించి అడ్మిన్‌ చర్యలు తీసుకోకుంటే వారిపై ఐపీసీ 153 ఏ, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకో వడం జరుగుతుందని తెలిపారు. కుల, మత, వర్గ, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే తప్పుడు సమాచా రం, అసభ్యకర, అభ్యంతరకర, నేరపూరితమైన, బెదిరింపులకు పాల్పడే, వ్యక్తిగ త పరపతి, మనోభావాలు దెబ్బతీసే విధంగా మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు/ వీడియోలు తప్పుదారి పట్టించే సమాచారం ఇతరులకు షేర్‌ చేయకూడదని తెలిపారు.