ఘనస్వాగతం పలికిన ప్రజలు
కూటమి పార్టీల సమక్షంలో జన్మదిన వేడుకలు
నిడదవోలు, మహానాడు : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం ప్రచారం నిర్వహించారు. విజ్జేశ్వరం గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెతోపాటు నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. పురంధేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజ్జేశ్వరం, గోపవరం, పురు షోత్తపల్లి, సమిశ్రగూడెం, డి.ముప్పవరం, కలవచర్ల, మునిపల్లి, పెండ్యాల గ్రామాలలో పర్య టించారు.
మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేషను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.