రేపు దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్‌

హాజరుకానున్న కేంద్రమంత్రి వి.కె.సింగ్‌

అమరావతి, మహానాడు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ హాజరుకానున్నారు. ఆయన చార్టర్డ్‌ విమానంలో రాజమహేంద్రవరం చేరుకుని నామినేషన్‌ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు.

అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అరకు అసెంబ్లీ అభ్యర్థిగా పాడేరు తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, ఆదోని అసెంబ్లీ అభ్యర్థి పి.వి.పార్థసారథి కూడా శుక్రవారం ఉదయం 10.40 గంటలకు ఆదోని తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

సుజనాచౌదరి నామినేషన్‌

ఎన్డీయే కూటమిలో 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్‌ సీట్లలో బీజేపీ పొత్తుతో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం విజయవాడ పశ్చిమ అభ్యర్థి సుజనాచౌదరి వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.