రాజమండ్రి, మహానాడు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు సోమవారం రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో బిజీబిజీగా ఉండటంతో కుటుంబ సభ్యులు వేకువజామున ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పురంధేశ్వరి పాల్గొన్నారు. ముందుగా వేదపండితులతో దగ్గుబాటి దంపతులు ఆశీర్వచనం తీసుకున్నారు. బీజేపీ నాయకులు, అభిమానులు హాజరయ్యారు.