మంగళగిరి, మహానాడు: మంగళగిరి పట్టణంలోని ఐ.హెచ్.సి కార్పొరేట్ భవనం రెండో అంతస్తులో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో శనివారం మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్యనారాయణ(సత్య) బాధ్యతలు స్వీకరించారు. మొదటిగా కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించి, మధ్యాహ్నం 12:36 నిమిషాలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రోడ్లు, భవనాలు,పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మైన్స్ , మినరల్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, గిద్దలూరు శాసన సభ్యుడు ముత్తముల అశోక్ రెడ్డి, సంతనూతలాడు శాసన సభ్యుడు బీఎన్ విజయ్ కుమార్ సత్యకుకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ సత్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నాపై నమ్మకం ఉంచి ఛైర్మన్ గా అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందని, పోర్ట్లు, హార్బర్స్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.