గుంటూరు, మహానాడు: నగరంపాలెం మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ మోహనరావు కొడుకు రావి సాయి డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని ఏపీ సెబ్ పోలీసులు, గుంటూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. హీరో రాజ్ తరుణ్ – లావణ్య డ్రగ్స్ సప్లయర్ రావి సాయి అని భావిస్తున్నారు. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి డ్రగ్స్ అందించినట్టు గుర్తింపు. ఇంకా… ఢిల్లీ నుండి డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు నిర్ధారించారు. కాగా, సాయి ఫోన్ లో అనేకమంది అమ్మాయిల వీడియోలు లభ్యమయ్యాయి. వీడియోలు చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడగా చెబుతున్నారు.