విజయవాడ, మహానాడు: రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ను దర్శి జనసేన ఇంఛార్జి గరికపాటి వెంకట్ విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించారు. మంత్రి మనోహర్ సానుకూలంగా మాట్లాడి, త్వరలో దర్శి వస్తానని హామీ ఇచ్చినట్లు వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.