దర్శి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి లోని డీజీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.. డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష దాడులు, దౌర్జన్యాలపై ఉన్న పెండింగ్ కేసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా దర్శిలో సామాన్య ప్రజానీకానికి ప్రశాంతమైన జీవితం ఉండే విధంగా లా అండ్ ఆర్డర్ కు పోలీస్ సిబ్బంది సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పోలీస్ సిబ్బంది నియామకాలపై కూడా డీజీపీతో సుదీర్ఘంగా చర్చించారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని డిజిపి హామీ ఇచ్చినట్లు లక్ష్మీ తెలిపారు.