ఢిల్లీ సీఎం అతిషి?

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తి, కేబినెట్లో 11 మంత్రిత్వ శాఖలు ఉన్న మంత్రి అతిషి పేరును ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు.. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో అతిషి కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.