రేవంత్ రెడ్డికి ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కృతజ్ఞతలు

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ని గురువారం కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా సీఎం రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇండ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పదికోట్లు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది.

జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.