రాక్షస పాలన మళ్లీ రాకూడదు

-డేగల ప్రభాకర్‌

గుంటూరు, మహానాడు : సైకో జగన్‌ రాక్షస పాలన మళ్లీ రాకూడదన్న ధృడనిశ్చయంతో ప్రజలున్నారని తెదేపా గుంటూరు నగర అధక్షులు డేగల ప్రభాకర్‌ అన్నారు. అర్బన్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్లతో ప్రభాకర్‌ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 5 ఏళ్లలో 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు హత్యకు గురయ్యారని తెలిపారు.సొంత బాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. నియంతపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.