రామోజీకి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నివాళి

అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతారులతో సమీక్ష

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫిల్మ్‌ సిటీలో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామోజీరావు కుమారుడు కిరణ్‌, కోడళ్లు శైలజ, విజయేశ్వరిలను పరామర్శించి సానుభూతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి ఏర్పాట్ల గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో ఉండటంతో ప్రభుత్వ ప్రతినిధిగా తాను ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంచనాలతో నిర్వహించను న్నామని చెప్పారు.

రామోజీరావు గొప్ప లౌకికవాద తాత్వికవేత్త అని కేంద్రం, రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉన్నా ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంగా వ్యవహ రించారని కొనియాడారు. ఈనాడు- ఈటీవి సంస్థల ద్వారా సామాజిక బాధ్యత లు నిర్వర్తించారని, వరద బాధితులకు తెలుగు రాష్ట్రాలనే కాదు ఇతర రాష్ట్రా ల్లోనూ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపించారు. హైదరాబాద్‌కు గొప్ప మణిహారంగా రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేశారు. ఒక సామాన్యుడు అసమాన్య విజయాలు సాధిస్తాడు అనే దానికి రామోజీరావు ఒక ఉదాహరణ అని ప్రశంసించారు. రామోజీరావు మృతి తీరనిలోటని పేర్కొన్నారు.