డీఎస్పీ హోదాలో ఉన్నా కులవృత్తిని మరువలేదు!

రాజన్న సిరిసిల్ల:  కుల వృత్తి కులానికి గౌరవం ఇస్తుంది.. అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు. పోలీసు వృత్తిలో ఉన్నా కుల వృత్తిపై ప్రేమతో కొలిమి లో పనిచేసి వృత్తికి గౌరవం తెచ్చారు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసి ఆశ్చర్యపరిచారు. ఉన్నతస్థాయిలో ఉన్నా కుల వృత్తిని మరచిపోలేదంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.