ఓటమి భయంతో ఆధారాలు మాయం

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు: ఓటమి భయంతోనే జగన్‌ గ్యాంగ్‌ ఆధారాలు మాయం చేసే పనిలో పడిరదని చిలకలూరిపే ట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగితాలు కాల్చేయడం, ఆధారాలు మాయం చేసినంత మాత్రానా చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరిం చారు. చిలకలూరిపేట 8, 9, 11వ వార్డుల కుటుంబ సాధికార సారథులు, బూత్‌ కన్వీనర్లు, పార్టీ నాయకులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడు తూ చిలకలూరిపేట తాడేపల్లి సిట్‌ ప్రాంగణంలో పెద్ద మొత్తంలో పత్రాలను దహనం చేయడం, అందులో హెరిటేజ్‌ పేరున్న పేపర్లు కూడా ఉండడంలో ఏదో భారీ కుట్ర దాగి ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. వివిధ సర్వే సంస్థల నుంచి సొంత నిఘా భాగం నివేదికల వరకు రాష్ట్రంలో వైకాపా ఓటమి ఖాయమని జగన్‌కు నివేదికలు ఇస్తున్నాయన్నారు. ఆ నేపథ్యంలో అక్రమాలను వెలుగులోకి రాకుండా బరితెగించారని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా సీఐడీ, సిట్‌ల పేరు చెప్పుకుని ఇంతకాలం విపక్షాలను వేధించిన జగన్‌ ప్రభు త్వం, ఇప్పుడు ఆ కార్యాలయాల్లోనే ఆపరేషన్‌ ఆధారాలు మాయం చేపట్టిందన్నారు. క్రోసూ రులో భాష్యం ప్రవీణ్‌ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పెదకూర పాడులో గెలవలేమనే వైసీపీ మూకలు రౌడీ రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్‌, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.