– ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
కావలి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలో శనివారం రెండవ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వంలో జరిగిన 100 రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందన్నారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని అనిపించుకుంటుందన్నారు.