మరోసారి అవకాశం కల్పించండి
టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్
కూటమి నేతలతో జోరుగా ఎన్నికల ప్రచారం
దెందులూరు, మహానాడు : దెందులూరు మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దెందులూరు మండలం పెరుగుగూడెం, చల్ల చింతలపూడి, ముప్పవరం, సీతంపేట గ్రామాల్లో వారు పర్యటించారు. మహిళలు పూలు, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అందరి ఆశీస్సులతో రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేశారు. ఈ సారి కూడా గెలిపించాలని కోరారు. నామినేషన్ ర్యాలీ లోనే విజయాన్ని చూపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బాబు సూపర్6 పథకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చా రు.
అధికారంలోకి వచ్చిన వెంటనే దెందులూరులో నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి కొనసాగి స్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సెక్రటరీ ఘంటసాల వెంకటలక్ష్మి, దెందు లూరు మండల పార్టీ అధ్యక్షుడు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), జనసేన నాయకులు కోటారు ఆదిశేషు, మండల కార్యదర్శి సత్తిబాబు, క్లస్టర్ ఇన్చార్జ్ పరసా వెంకట రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు దశరథ్, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, టీడీపీ, బీజేపీ, జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.