– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
పెదకూరపాడు, మహానాడు: అమరావతి నూతన రైల్వే లైన్ నిర్మాణంతో రాజధాని ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అమరావతి నూతన రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నూతన రైల్వే లైన్ నిర్మాణంతో అమరావతి రాజధానికి మహర్ధశ పడుతుందన్నారు.
ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించనున్న నూతన రైల్వే లైన్ రాజధానికి మణిహారంగా నిలవనుందన్నారు. ఈ రెండింటి మధ్య వాహన రద్దీ తగ్గుతుందన్నారు. అమరావతి నూతన రైల్వే లైన్ కు ఆమోదం తెలిపిన కేంద్రానికి, కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.