బాబు డైరెక్షన్ లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి ..

– ఆంధ్రా వాళ్లంటే మాకు గౌరవం
– నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నా
– ఆంధ్ర, తెలంగాణ అంటూ చిల్లర రాజకీయం
– ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు, గాంధీకి వ్యక్తిగతం మాత్రమే
– దానం నాగేందర్ కు గోకుడు ఎక్కువ
– సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

హైదరాబాద్: కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి వద్ద సమావేశం అవుదామని అనుకున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారు.ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్దామని నేను, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బయలుదేరాము. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు.

నాపై ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు? స్వయంగా రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయండని చెప్పారు. నాపై హత్యాయత్నం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎట్లా? నేను చేసిన తప్పు ఏంటి? అరికెపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.

స్వయంగా అరికెపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. అరికెపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా? నేను వుండే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి. అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ఉంటారు. నా విల్లాపై దాడి చేసి సెక్యూరిటీ గేట్లు పగులగొట్టారు. గాంధీ రౌడీయిజం చూడటానికి మీకు ఓట్లు వేశారా?

గాంధీ నా ఇంటికి వచ్చి చేసింది ఏం లేదు. గాలికి పగిలిపోయే నా గేట్లు పగలగొట్టి వెళ్లిపోయారు. మా నాయకుడు కేసీఆర్ సంస్కారం నేర్పించారు. కరీంనగర్ నుండి నేను హైదరాబాద్ వచ్చానని అరికెపూడి గాంధీ అన్నారు. నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అని గాంధీ అంటారు. కానీ ఇంటి చూట్టూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి. నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నాను. ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది. చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.

హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు. రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు. రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు. కాంగ్రెస్ మంత్రులు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు.

రేవంత్ రెడ్డికి ఇక నుండి కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు అవసరం లేదు. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు. బిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతా.కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా? కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా? రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి.

మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారు. నిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్ కు తీసుకువెళ్లారు. బిఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది. పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. నాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు కార్యకర్తలకు ధన్యవాదాలు.

హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా. కేసీఆర్ పెట్టిన భిక్షతో, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పటికైనా సిగ్గు,శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.

నేను అడిగిన ప్రశ్నలకు అరికెపూడి గాంధీకి ఎందుకు భయం? పీఏసీ చైర్మన్ గా బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు. దానం నాగేందర్ కు గోకుడు ఎక్కువ ఉంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.

నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు. నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు. ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బిఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు. సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.