ఎమ్మెల్యే విజయ్ చంద్ర
పురపాలక సంఘ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. పార్వతీపురం పురపాలక సంఘంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశంలో నిర్వహించారు.
పట్టణంలో పారిశుద్ధ్యనికి ప్రాధాన్యత మరింత పెంచాలని లక్ష్యంగా సంబంధిత అధికారులు సిబ్బంది పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
తాగునీటి వెతలపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నీటి సమస్య లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆర్థిక భారం పడకూడదని చెత్త పనులు రద్దు చేసిందని గత ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి వర్గాలపై చెత్త పన్ను విధించి ఆర్థిక భారం అవుతుందని దాని నుంచి కూటమి ప్రభుత్వం ఉపశమనం కలిగించిందని ఎమ్మెల్యే వివరించారు.
వీధి దీపాల నిర్వహణ సక్రంగా ఉండాలని ఎక్కడైనా లైట్లు పాడైతే తక్షణ వాటిని ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే పన్నుల విషయంలో తొలిత నుంచి ప్రణాళిక బద్ధంగా వెళ్లి పురపాలక ఆర్థిక పరిపుష్టికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వివిధ శాఖలపై ఉన్న సమస్యలను ప్రస్తావించారు వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.