వైసీపీ- కూటమి పాలనకు మధ్య తేడా అభివృద్ధే చెబుతుంది

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

పిట్టంబండ, మహానాడు: రాష్ట్రంలో వైసీపీ – కూటమి ప్రభుత్వాల మధ్య తేడా ఏమిటో నాలుగు నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే చెబుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రోడ్ల విషయంలో, పల్లెల అభివృద్ధి విషయంలో అయిదేళ్లుగా ఏం జరిగిందని ప్రజలే బేరీజు వేసుకుంటారన్నారు. గుంతలు పడిన రోడ్లలో జనం ప్రాణాలు పోతున్నా తట్టెడు మట్టెవేయని జగన్ – వస్తూనే వేల కిలోమీటర్ల మేర రోడ్ల దిశ మారుస్తున్న చంద్రబాబు పాలనకు మధ్య తేడా ఏ ఊరికి వెళ్లినా కనిపిస్తుందన్నారు. వినుకొండ మండలం ఏనుగుపాలెం, పిట్టంబండలో ఎమ్మెల్యే పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఏనుగుపాలెంలో రూ.14 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. అనంతరం పిట్టంబండలో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్నప్పటికీ 2.30 లక్షలమంది పింఛన్లను జగన్‌రెడ్డి తొలగించారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో నిశంక్కర శ్రీనివాసరావు, వినుకొండ రూరల్ మండలం మండల పార్టీ అధ్యక్షులు మాదినేని ఆంజనేయులు, క్లస్టర్ ఇంచార్జ్ మద్దూకూరి రామ బ్రహ్మం, వజ్రాల కృష్ణ రెడ్డి, మక్కెన కొండలు, మూతినేని ఏడుకొండలు, కర్నాటి వెంకట రెడ్డి, వీరగంధం ఆనంద్, మాదల చిరంజీవి, మాదల కృష్ణ, బోడేపూడి గోవిందరాజులు, కానాల వెంకటేశ్వర రెడ్డి, ఎర్రంరెడ్డి అంజిరెడ్డి, రామినేని రామాంజనేయులు, గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ నాయకులు కార్యకర్తలు, ధ్వమా పీడీ సిద్ది లింగ మూర్తి, గవర్నమెంట్ అధికారులు పాల్గొన్నారు.