-వ్యవస్థలు ఎలా భ్రష్టుపట్టాయో మాచర్లే ఉదాహరణ
-ప్రజల మద్దతుతో కూటమి అధికారంలోకి రాబోతోంది
-వైసీపీ నేతలు ఏ కలుగులో దాక్కున్నా వదలం
-చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించక తప్పదు
-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మంగళగిరి: సజ్జల రామకృష్ణారెడ్డి జూన్ 5న పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఈరోజే పెట్టి బోరున విలపిస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎస్ భూదందాను సాక్షాధారాలతో సహా బయటపెట్టాం. మేం తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని సజ్జల అనడం సిగ్గుచేటు. 15 రోజులుగా మాచర్లలో ఏం జరుగుతుందని సజ్జల అంటున్నాడు. ఐదేళ్లుగా మాచర్లలో ఏం జరిగింది? రెండు లక్షలు కూడా లేని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రెండు వేల కోట్లు ఎలా సంపాదించాడు?
దాడులు చేసింది ఎవరు..
మాచర్లలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలను నామినేషన్ కూడా వేయకుండా దాడులు చేసింది ఎవరు? మా పార్టీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమా, లాయర్ కిశోర్‌పై మాచర్లలో పట్టపగలే వైసీపీ గుండాలు దాడి చేశారు. ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశావని పిన్నెల్లిని అడగకుండా ఆ వీడియో ఎలా బయటికి వచ్చిందని ఈసీని ప్రశ్నించడం సిగ్గుచేటు. వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేసిన చోట నాడే మేము రీ పోలింగ్ అడిగాం. కానీ మేము రీపోలింగ్ అడగలేదని సజ్జల మాట్లాడడం దివాలాకోరుతనం. అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డి కాదా? సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సజావుగా జరగదు. వెంటనే ఆయన్ని విధుల నుంచి తప్పించాలి. మరో నాలుగురోజుల్లో జగన్ ప్రమాణస్వీకారం అంటూ సజ్జల పగటి కలలు కం టున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కూటమి అధికారంలోకి రాబోతోంది.
అధికారులను, ఈసీని బెదిరిస్తున్నారు
వైసీపీ నేతలు అధికారులను, ఈసీని బెదిరిస్తున్నారు. వాళ్ల బెదిరింపులుకు భయ పడే పరిస్థితి లేదు. పిన్నెల్లి సౌమ్యుడు, మంచివాడు అంటూ సజ్జల మాట్లాడటం సిగ్గుచేటు. పిన్నెల్లి మంచివాడు అయితే గుండ్లపాడులో మా కార్యకర్త తోట చంద్ర య్య పీక కోసింది ఎవరు? స్థానిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు నామినేషన్ వేయకుండా దాడులు దౌర్జన్యాలకు పాల్పడిరది ఎవరు? మాచర్లలో గ్రానైట్ లారీకి ఒక్కో లారీకి 7000 వసూలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా బ్రష్టు పట్టాయన్నా దానికి మాచర్ల ఉదాహరణ. వైసీపీ నేతల అరాచకా లన్నిటికీ సమా ధానం సమాధానం చెప్పాలి. ఇప్పటికే వైసీపీ నేతలు విదేశాలకు పారిపోతున్నారు. పెద్దిరెడ్డి యంత్రాలు సైతం విదేశాలకు తరలించేశాడు. మీరు ఏ కలుగులో దాక్కున్నా బయటికి లాక్కొస్తాం. మీరు చేసిన అరాచకాలన్నింటికీ సమాధానం చెప్పాలి.
దుకాణం బంద్ అయింది…
వైసీపీ దుకాణం బంద్ అయింది. ఐదేళ్ల అరాచకాలు దౌర్జన్యాలను లెక్కపెట్టి మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు కూటమికి ఓటు వేసి వైసీపీని చెంపదెబ్బ కొట్టారు. చదువుకున్న యువత 80 శాతం మంది కూటమికి ఓటేశా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూటమికి మద్దతు పలికారు. వైసీపీ నేతలు ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి. వైసీపీ అరాచకాలు దేశం మొత్తం చూసింది. రంగనాయకమ్మ మీద సోషల్ మీడియాపై పెట్టిన కేసు నుంచి ప్రతి కార్యకర్త, నాయకుడిపై పెట్టిన అక్రమ కేసులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.