-బట్టలూడదీసి కొట్టేరోజులు దగ్గరపడ్డాయి
-బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరిక
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డి లాంటి నీచుడిని మూడో సారి తీసుకొచ్చి జగన్ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడని బీజేపీ నేత నవీన్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. టీటీడీలో ధర్మారెడ్డి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది. జగన్ అండతో ధర్మారెడ్డి చేసిన అక్రమాలను దుర్మార్గాలను అవినీతిని భగవంతుడు కూడా భరించలేకపోయాడు. మీ పాపం పండింది వెంకన్న ఆగ్రహానికి గురై భూస్థాపితం అయిపోతున్నారన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటు వంటివని దాని జోలికి వెళ్లొద్దని జగన్‌ను పదేపదే హెచ్చరించినా అహంకారం తో, అధికార బలంతో కళ్లు నెత్తికెక్కి ధర్మారెడ్డి లాంటి నీచుడిని టీటీడీకి తీసుకొచ్చి తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నాడన్నారు. జగన్ అండ చూసుకుని శ్రీవారి భక్తులను వేధించావు..నీకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. జగన్ అండతో నాపై పెట్టిన కేసు వెంకన్న అనుగ్రహంతో నిన్న హైకోర్టు కొట్టి వేసింది.. నీ చెంప చెల్లుమనిపించిందన్నారు. ధర్మారెడ్డి అవినీతి అక్రమాలపై ఎన్డీఏ కూటమి విచారణకు ఆదేశించాలని, భక్తులు, ఉద్యోగులు, అర్చకులను వేధించిన ధర్మారెడ్డిని బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కూటమి గెలుపుతో దోచుకున్న సొమ్ము తో విదేశాలకు పారిపోవాలని చూస్తున్న ధర్మారెడ్డిపై కేంద్ర నిఘా వర్గాలు ‘‘రెడ్ కార్నర్’’ నోటీసు ఇచ్చి ఎన్డీఏ కూటమి అలర్ట్ చేయాలని శ్రీవారి భక్తునిగా డిమాండ్ చేశారు. శ్రీవారి సొమ్ము ప్రతి పైసా వెంకన్న ఖాతాకు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మారెడ్డికి చంచల్ గూడ జైల్లో చిప్ప కూడు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.