గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు మార్, పొన్నూరు జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కం డేయులు పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో పర్యటించారు. సూపర్ 6 లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ వివరించారు. వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సొంత ఇల్లు, రెండు కరెంటు మీటర్లు ఉన్నాయని పెన్షన్లు తీశారని, గ్రామంలో నీళ్లు సరిగా రావడం లేదని, రేషన్‌కార్డులు ఇప్పించాలని, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి లోన్లు మంజూరు చేయాలని కోరారు. సైడ్ డ్రైన్లు సరిగా లేక మురుగు నీరు రోడ్డు మీదకి వస్తుందని, రోడ్డు మీద నడవడానికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని త్వరగా సైడ్ డ్రైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని తెలిపారు.