నెహ్రూ కట్టిన ప్రాజెక్టులలో నీళ్లు తాగి బతకలేదా?

-టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చురకలు
-గాంధీభవన్‌లో నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళి

హైదరాబాద్‌, మహానాడు
జవహర్‌ లాల్‌ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ ప్రధాని అయినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణం చేశారు. వాటితో వ్యవ సాయానికి నీరు అందించారు. విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. కరువు నివారణకు ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసుకునే ఉపాయం చేశారు. పదేళ్లలో ప్రధాని మోదీ ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం అయిన చేశారా? అని ప్రశ్నించారు. తాగునీటి కొరత రావద్దని మంజీరా డ్యాం నిర్మాణం చేశారు. కాంగ్రెస్‌ ప్రభు త్వ హయాంలో కట్టిన డ్యాం నీళ్లు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులు తాగి పెరిగా రు. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన మంజీరా నీరు తాగలేదా..? కాంగ్రెస్‌ ఏం చేయలేదు అని ఎలా అంటారు? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కట్టింది కాంగ్రెస్‌.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంది మోదీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.