అది బుగ్గన“ ఓటి కుండ బడ్జెట్ “

– ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్

2019 – 20 బడ్జెట్ సైజ్ 1.80 లక్షల కోట్ల నుండి 2024 – 25 కి 2.86 లక్షల కోట్లకు పెరిగితే, అన్ని రకాల అప్పులు కలిపి దాదాపు 7 లక్షల కోట్లు పెరిగి రాష్ట్రం అప్పులు అన్నీ కలిపి 12 లక్షల కోట్లు దాటడం దౌర్భాగ్యం.

గడచిన అయిదు సంవత్సరాలలో సగటున రెవిన్యూ ఆదాయం పెరిగినా రెవిన్యూలోటు, ద్రవ్య లోటు ఇంత భారీగా ఉండడడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణకు నిర్వచనం.

బడ్జెట్ లో 30 వేల కోట్లకు పైగా మూలధన వ్యయం చూపారు, గత అయిదు సంవత్సరాలలోవాస్తవ మూలధన వ్యయం దారుణం, ఆస్తుల కల్పన లేదు

రాష్ట్ర భవిష్యత్తు అప్పుల పైన వడ్డీలు కట్టలేని దుస్థితి. కార్పొరేషన్ల రుణాలు పెరిగాయి కానీ వాటికి ఆదాయాలు లేవు, ఆడిట్ కూడా సకాలంలో చేయించడం లేదు.పెండింగ్ బిల్లులు కుప్పలు కుప్పలుగా పేరుకు పోయాయి.ఇష్టం వచ్చినట్టు అప్పుల పైన గ్యారంటీలు ఇచ్చారు.