– ఓటర్ల తుది జాబితాలోని అవకతవకలతపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి 10 లేఖలు రాసిన మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఏ షరిఫ్
• జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఫామ్-6, 7, 8/8ఏ లకు సంబంధించి అనేక పిర్యాదులు చేయడం జరిగింది.
• ఆ పిర్యాదుల తాలుకు ఎటువంటి సమాచారం ఎన్నికల సంఘం వెబ్ పోర్టల్‌లో కనిపించడం లేదు.
• పేర్లు సరిదిద్దటం, ఓట్ల తొలగింపు, చేర్పులు లాంటి పిర్యాదులకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసేలా సంబంధిత నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇవ్వండి.
• రాజానగరం అసెంబ్లీ ఓటర్ల లిస్టులోని డబుల్, త్రిబుల్ ఎంట్రీలను తొలగించాలని అక్కడి ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించండి.
• గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,287 మరణించిన వారి ఓట్లు, 3,318 డబుల్ ఓట్లు తొలగించలేదు.
• గన్నవరం టిడిపి ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆ ఓట్లు తొలగించాలని కృష్ణా జిల్లా కలెక్టరుకు సైతం పిర్యాదు చేశారు. కానీ నేటికీ వాటిని తొలగించలేదు.
• ఈ ఓట్లను తొలగించేందుకు జిల్లా కలెక్టరుకు, జిల్లా ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేయండి.
• చిలకలూరిపేట అసెంబ్లీలోని 134,143 పోలింగ్ స్టేషన్లలో 97 మంది చనిపోయిన వారి ఓట్లు ఇప్పటికీ తొలగించలేదు.
• నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ 32 లో 39 మంది చనిపోయిన వారి ఓట్లు, రెండు డబుల్ ఎంట్రీలను తొలగించలేదు.
• చిత్తూరు జిల్లా, చంద్రగిరి అసెంబ్లీలోని వివిధ పోలింగ్ స్టేషన్లలో వివిధ కారణాలతో 68 ఓట్లు తప్పుగా నమోదు చేయబడ్డాయి.
• శృంగవరపుకోట, గంగాధర నెల్లూరు, పలమనేరు, విజయవాడ తూర్పు, విజయనగరం, రాయదుర్గం, సింగనమల అసెంబ్లీ నియోజకవర్గాలలో చోటుచేసుకున్న అవకతవకలను లేఖల్లో ప్రస్తావించిన ఎం.ఏ ఫరీఫ్
• లేఖలతో పాటు వాటికి ఆధారాలను జత చేసిన ఎం.ఏ షరీఫ్