సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను జిల్లా వెనకబడిన తరగతుల కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాబాయి గురువారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలందరికీ త్వరలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్, బీసీ కార్యాలయ సిబ్బంది అనిల్, సుష్మ, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.