అమరావతి, మహానాడు : వైసీపీ సభ్యత్వానికి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి కిలారు అశోక్‌బాబు బుధవారం రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అంతర్గత విభేదాలు ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించు కోక పోవడంతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలో నియోజవర్గ పరిధిలో అభివృద్ధి లేదని చెప్పారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని కార్యకర్తలకు ఎటువంటి సహాయం చేయలేకపోయానన్న బాధ ఉందన్నారు. 30 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉందని తెలిపారు.
గతంలో జడ్పీటీసీ అభ్యర్థిగా తాను ఓడిపోయినా 2019లో తానేటి వనిత గెలుపు కోసం కృషిచేసినట్లు వివరించారు. వైసీపీలో రాను రాను వ్యక్తిగత విమర్శలకు దిగజారటంతో మనసు చలించిపోయి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, చాగల్లు మండల కార్యకర్తలు, నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడిరచారు. తనతో పాటు చాగల్లు మండ లం మల్లవరం గ్రామానికి చెందిన లకంసాని శ్రీనివాసరావు కూడా రాజీనామా చేసినట్లు చెప్పారు.