బాలీవుడ్ తరువాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు తీసే ఇండస్ట్రీ టాలీవుడ్. మన సినీ పరిశ్రమలో ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కానీ.. స్టార్ డైరెక్టర్లుగా వెలిగిపోతున్న వాళ్లతో ఓ తంటా వచ్చిపడుతోంది. వీళ్లు ఏ సినిమా తీసినా బడ్జెట్ లెక్కలు 50 దాటిపోతున్నాయి. హీరో స్టామినా ఎంతో, ఎంత రికవర్ చేయగలడు అనే అంచనాలు లేకుండా, తాము తీసిన ప్రతీ మూవీకి నిర్మాతలతో యాభై ఖర్చు పెట్టించేస్తున్నారు కొంత మంది దర్శకులు. దీంతో ఆయా హీరోల స్టామినా కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టించడంతో.. సినిమాకి వసూళ్లు వచ్చినా చివరకు కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకోవాల్సి వస్తోంది. మరి బడ్జెట్ లేకుండా క్వాలిటీ రాదా అంటే.. డైరెక్టర్ మారుతిని ఈ విషయంలో ప్రశంసించాల్సిందే. తను తీసిన ప్రతీ మూవీకి.. బడ్జెట్ కంటే ఐదారు రెట్లు వసూళ్లు చేయగలిగాడు. వసూళ్ల సంగతి పక్కన పెట్టినా, తక్కువ ఖర్చులోనే ఎక్కువ క్వాలిటీతో ఔట్ పుట్ తేగలుగుతున్నాడు. మరి మారుతి లాంటి బడ్జెట్ కంట్రోల్ స్ట్రాటజీని మిగతా డైరెక్టర్లు కూడా అలవర్చుకుంటే.. టాలీవుడ్ లో హిట్ మూవీల సంఖ్య బాగా పెరుగుతుంది.
దాసరి నారాయణరావు… టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక లవ్ స్టోరీలకు మరియు యాక్షన్ చిత్రాలకు మాత్రమే పరిమితం కాదు.కన్నీళ్లు పెట్టించే ఎన్నో సెంటిమెంటల్ సినిమాలకు కూడా పెట్టింది పేరు.అందుకే ఉదాహరణ చెప్పాలంటే దర్శక దిగ్గజాలైన దాసరి, కృష్ణ వంశి మరియు ఎస్వీ కృష్ణ రెడ్డి వంటి వారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా కథ, పాటలు, మాటలు కూడా అందించిన వ్యక్తి దాసరి.రాఘవేంద్ర రావు వంటి దర్శకుడితో తీవ్రమైన పోటీ ఉండేది.కళ్ళకు ఎంతో విందుగా ఉండే సినిమాలు అయన తీస్తే దాసరి మాత్రం మాటల్తో తూటాలు పేల్చేవారు. ఇకపోతే చివరి దశలో మాత్రం ఎన్నో ఫ్లాప్ చిత్రాలను తీశారు ఎర్ర బస్సు వంటి చప్పిడి సినిమాను సెకండ్ ఇన్నింగ్స్ లో తీసి అభిమానులను నిరాశ పరిచారు.
ఎస్.వి. కృష్ణారెడ్డి… మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే ప్రేమను, బంధాలను తెరపైన చూపించి ప్రేక్షుకుడి హృదయాన్ని కదిలించడం లో కృష్ణ రెడ్డి దిట్ట.అయన సినిమాలో మంచి నాణ్యమైన హాస్యం ఉంటుంది. విరామం తీసుకొని యమలీల 2 అంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చారు. అది సగటు కృష్ణ రెడ్డి అభిమానులను నిరాశ పరిచింది. ఇక ఇటీవలె విడుదలైన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అంటూ వచ్చిన చిత్రం చూసాక అయన మార్కు ఎక్కడ కనిపించక నాసిరకంగా అనిపించింది.
కృష్ణవంశీ…రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఈయనది ఒక భిన్నమైన పంథా. సహజమైన కథలతో, భిన్నమైన ఆలోచనలతో, కృష్ణ వంశి సినిమాలు తీస్తాడు. అయన తీసిన సంధూరం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మురారి వంటి చిత్రాలు దేనికదే ఒక భిన్నమైనవి. ఇన్ని మంచి చిత్రాలు తీసిన అయన పైసా , గోవిందుడు అందరివాడు, నక్షత్రం వంటి చిత్రాలు చూసాక ఆయనను మాత్రమే నమ్మి వెళ్లి థియేటర్ లో సినిమా చూసాక నిరాశ మాత్రమే చివరికి మిగులుతుంది.
రామ్‌గోపాల్ వర్మ… ఒకప్పుడు ఆయన సినిమాలంటే థియేటర్లు హౌస్‌ఫుల్ ఉండేవి. ప్రస్తుతం ఆయన సినిమాలన్నీ కూడా అర్ధం పర్ధం లేకుండా ఉంటున్నాయి. లస్ట్.. రొమాన్స్ తప్పించి లేదా బయెపిక్‌లు ఇవే ఆయన తీసే కథలన్నీ ఇకపోతే బయోపిక్‌ల విషయానికి వస్తే వాటిలో ఆయన ఎంత వరకు వారి నిజజీవితన్ని తెరకెక్కించారు అన్నది ప్రేక్షకులకు సందేహంగానే మిగులుతుంది. వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. దివంగత నే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల పై తీసిన చిత్రమిది. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే అదేదో షార్ట్ ఫిల్మ్‌లాగా ఉందే తప్పించి కంటెంట్‌లో దమ్ము లేదు. అదేవిధంగా ఓ లైన్ ప్రకారం వెళ్ళలేదు. వ్యూహమే అలా ఉండడంతో శపథం పూర్తిగా థియేటర్లలోనే విడుదల కాలేదు.
మెహర్ రమేష్… డైరెక్టర్ మెహర్ రమేష్ అనగానే చాలామంది శక్తి, షాడో, కంత్రీ అలాగే చిరంజీవితో తీసిన భోళాశంకర్ వంటి అట్టర్ ఫ్లామ్ సినిమాలే ఎక్కువగా గుర్తువస్తుంటాయి. కానీ అలా మూడు మరియు నాలుగు సార్లు జరిగితే ఆ డైరెక్టర్ని పెద్ద రాడ్ డైరెక్టర్ కింద ముద్ర వేస్తారు. ఈ కోవా కి చెందిన వాడే మెహర్ రమేష్ కూడా. తన డైరెక్షన్ తో బాహుబలి రేంజ్ ఊహలు కలిగించిన సినిమాలో మాత్రం ఎటువంటి కంటెంట్ ఉండదు. ఇక ఒక సినిమా ఫ్లాప్ అయింది కదా అని మరో సినిమాపై ఎక్కువ దృష్టి పెడతాడా అంటే అది ఉండదు. ప్రస్తుత కాలంలో ఎటువంటి టాపిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయో వాటిని ఎంచుకోకుండా ఏదో చిన్న పిల్లల కథలాగా రాసుకుని దాంట్లో స్టార్ హీరోలను పెడుతూ వాళ్ళ ఖాతాలో ఒక్కో డిజాస్టర్ వేస్తున్నాడు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సూర్య కిరణ్. టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య కిరణ్ తాజాగా అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. పచ్చ కామెర్ల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన ఈయన మృతికి అసలైన కారణాలు ఇవే అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది నటి కరాటే కల్యాణీ. ఆయన మృతికి ఆయన మాజీ భార్య కళ్యాణీయే కారణం అంటూ వివరించింది. సూర్య కిరణ్ మరణం పట్ల కరాటే కళ్యాణి స్పందిస్తూ అసలు సూర్య కిరణ్ చనిపోవడానికి ఆయన అలవాట్లే. సూర్య కిరణ్ కు మందుతాగే అలవాటుతో పాటు సిగరెట్లు తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంది.వాటి వల్లే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి.రోజూ ఎక్కువగా సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం చేసే వారు.వాటి వల్లే ఆయన చాలా కాలంగా అనేక రకాల హెల్త్ సమస్యలతో బాధ పడుతున్నారు. ఆ కారణాలతో ఆయన మాజీ భార్య, హీరోయిన్ కళ్యాణీ వల్లే ఆయనకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి. సూర్య కిరణ్ కు ఆమె విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అందువల్లే తాగడం అలవాటు చేసుకున్నారు .కానీ సూర్య కిరణ్ ఇంత త్వరగా చనిపోతారని అసలు అనుకోలేదు.
ప్రస్తుతం వచ్చే యంగ్ డైరెక్టర్లు కూడా ఒక్క సినిమా హిట్ కొడుతున్నారు. సదరు ప్రేక్షకుడు తరువాత అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లకి వెళితే మాత్రం రెండో సినిమాలో సరుకు ఉండడంలేదనే చెప్పాలి. మంచి కథలు వస్తే దర్శుకుడు.. హీరోలతో సంబంధంలేకుండా హిట్ కొట్టిన కథలు ఎన్నో ఉన్నాయి.