ఘనంగా ‘డర్టీ ఫెలో’ ప్రీ రిలీజ్

ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న డర్టీ ఫెలో ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ చిత్రంలో దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ‘డర్టీ ఫెలో’ చిత్రాన్ని గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జి శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ – శాంతి చంద్ర నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి. ఆయన మంచి వాడు. సినిమాకు డర్టీ ఫెలో టైటిల్ ఎందుకు పెట్టారని అడిగాను. ఈ సినిమాకు ఆ టైటిల్ తప్ప మరో ఛాయిస్ లేదని డైరెక్టర్ గారు చెప్పారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న శాంతి చంద్ర అన్న హీరోగా ఈ మూవీ చేస్తుండటం సంతోషంగా ఉంది. డర్టీ ఫెలో సినిమా పాటలు, ట్రైలర్ చూశాను. మంచి కథతో వస్తున్న మూవీ ఇది. శాంతి చంద్ర అన్న తను కోరుకున్న అంశాలతో నచ్చిన విధంగా ఈ సినిమాను నిర్మించాడు. డాక్టర్ సతీష్ గారి మ్యూజిక్ సూపర్బ్ గా ఉంటుంది. డర్టీ ఫెలో సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు. దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ – డర్టీ ఫెలో సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఒక కుటుంబంలా పనిచేశారు. మన ఇంట్లో వాళ్లను పొగడాల్సిన అవసరం లేదు. నేను చేసే రిక్వెస్ట్ ఒకటే. ఒకప్పుడు మన సినిమాలకు శతదినోత్సవాలు జరుపుకునేవాళ్లం.