చంద్రబాబు కు దివ్యాంగుల పాలాభిషేకం

గుంటూరు లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగుల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోనుగుంట్లకోటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.దివ్యాంగుల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు  మాట్లాడుతూ…

దివ్యాంగుల ఫెంక్షన్ 3వేల నుంచి6వేల రూపాయలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. వైసీపీప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి దివ్యాంగుల ఉసురు తగిలి సర్వనాశనం ఐపోయాడని ఎద్దేవాచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులపై అరాచకాలపరాకాష్ట కొనసాగడం వల్లే ఎన్నికల్లో ఒడిపోయారని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 3వ సంతకంతో దివ్యాంగుల జీవితాలకు వెలుగులు నింపారని సంతోషం వ్యక్తం చేశారు. దివ్యాంగుల ఆశాజ్యోతి చంద్రబాబు అంటూ కొనియాడారు
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రాభివృద్ధికి తోడయిందని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు చంద్రబాబు దేవుడంటూ నినాదాలు చేశారు.