‘రాజధాని’ ఉద్యమ కేసు కొట్టివేత

గుంటూరు, మహానాడు: రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల పోరాటానికి మద్దతుగా నాడు వేలాది మంది విద్యార్థులు, ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అయితే, గత ప్రభుత్వం ఆందోళనకారులైన విద్యార్థి, యువజన, జెఏసి నాయకులపై అక్రమంగా కేసు నమోదు చేసింది. ఆ కేసును కోర్టు సోమవారం కొట్టివేసింది.

గుంటూరు ఆరో అదనపు మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కొట్టి వేసినట్టు తీర్పు వెలువరించారు. తీర్పుపై అడ్వకేట్ అబ్దుల్, అమరావతి జేఏసీ నాయకులు పిడికిటి మల్లికార్జునరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు, తెలుగు యువత మాజీ నాయకులు అబ్బూరి మల్లి, గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ,మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. వెంకటేశ్వరరెడ్డి, జనసేన యువజన నాయకులు డాక్టర్ సతీష్, ఆటో యూనియన్ నాయకులు ప్రతాప్ హర్షం వ్యక్తం చేశారు.