ఇసుకను సక్రమంగా పంపిణీ చేయండి: మాజీమంత్రి

గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుకను సక్రమంగా పంపిణీ చేయాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలోని కొల్లిపర, మున్నంగి  ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉచిత ఇసుక పంపిణీలో   అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.